ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 5:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:

పోలీస్ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహిస్తామని డీజీపీ సీవీ ఆనంద్, తెలిపారు. పోలీస్ ట్రైనింగ్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా పోలీస్ రిక్రూట్మెం ట్ బోర్డు పనితీరు నియామకాల పురో గతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌ మెంట్‌లో ఇప్పటి వరకు ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేద ని, ఇదే బోర్డు విశ్వస నీయతకు నిదర్శన మని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. పోలీసు నియామకాల్లో పార దర్శ కతకు తెలంగాణ ఆదర్శమని కొనియాడారు.
సీసీటీఎన్‌ఎస్ జాతీయ స్థాయి బెంచ్‌మార్క్‌ను చేరుకోవాలంటే అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త టెక్నాలజీ వాడాలనీ, అన్ని యాప్‌లూ వినియోగించాలని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను పారదర్శ కంగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
2022-23లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పోలీస్ నియామక ప్రక్రియ ద్వారా 16, 654 పోస్టులు భర్తీ చేసినట్టు వెల్లడిం చారు. ఇప్పటివరకు జరిగిన నియామకా ల్లో 95 శాతం కానిస్టే బుల్ పోస్టులు, 5 శాతం ఎస్ఐ పోస్టులే ఉన్నట్టు వివరించారు.
2025 నోటిఫికేషన్ల లో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, 1,743 డ్రైవర్ ఆపరే టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగు తోందని తెలిపారు. తొలిసారిగా నిర్వహిం చిన ఫింగర్ ప్రింట్ అండ్ ఫోరెన్సిక్ పోస్టుల నియామకం లో 60 పోస్టులకు 57 మంది ఎంపికయ్యా రని వివరించారు.
రిక్రూట్మెంట్‌లో 33 శాతం రిజర్వేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ఆరఎఫ్‌ఐడీ టెక్నాలజీ, మొబైల్ అండ్ ఈ-మెయిల్ రిజిస్ట్రేషన్, నెగెటివ్ మార్కింగ్ వంటి సంస్కరణలను వివరించారు. పోలీస్ ట్రైనింగ్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ ఆధునికీకరణపై డీజీపీ పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో నూతన కమ్యూనికేషన్ సెట్లను డీజీపీ సి.వి. ఆనంద్ ఆవిష్కరించారు.
=======================